ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్..ఇవాళ విచారణకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే !

-

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇవాళ విచారణకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ ఏసిపి వెంకటగిరి ఎదుట విచారణకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..హాజరు కానున్నారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా ఈరోజు విచారణకు వస్తానని తెలిపారు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Former Nakirekal MLA Chirumurthy Lingaiah 

అరెస్టయిన పోలీసు అధికారి తిరుపతన్న ఫోన్ డేటా రిట్రీవ్ తో మాజీ ఎమ్మెల్యే లింగయ్య కి నోటీసులు ఇచ్చారు. అదనపు ఎస్పీ తిరుపతన్నతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య… పలు సందర్భాల్లో ఫోన్ లో సంప్రదింపులు జరిపినట్టు నిర్ధారణకు వచ్చారట పోలీసులు. దీంతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయమన్నారు జూబ్లీహిల్స్ ఏసిపి. మరి కొందరు రాజకీయ నేతలను విచారించేందుకు దర్యాప్తు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లు, రాజకీయ పార్టీలకి చెందిన నగదు రవాణా అంశాలపై మాజీ ఎమ్మెల్యే లింగయ్య ప్రశ్నించనున్నారు జూబ్లీహిల్స్ ఏసిపి.

Read more RELATED
Recommended to you

Latest news