ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ల మీద ఫిర్యాదు చేశాను : కేటీఆర్

-

రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్లు పూర్తికాలం అధికారంలో ఉంటేనే మళ్లీ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుంది అని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సంస్కరణాలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్మ్ ల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం ఉండవద్దని చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా. రాష్ట్రంలో మార్పు అనేది వచ్చింది. కానీ అది మంచి మార్పు కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే మార్పు అయ్యింది. ఫార్మాసిటీ కోసం మేము సేకరించిన ల్యాండ్ అంతా కూడా కండిషనల్ ల్యాండ్. ఆ భూమిని వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదు.

కానీ రేవంత్ రెడ్డి హైకోర్టు కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. కోర్టులో ఫార్మాసిటీ ఉందంటాడు. బయట రద్దైందని అంటాడు. అసలు ఫోర్త్ సిటీ కోసం ఈ ప్రభుత్వం ఒక్క ఎకరాం ల్యాండ్ అయినా సేకరించిందా అని అన్నారు. ఫార్మాసిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తే ఊరుకోం. ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తామంటే కుదరదు.నేను ఢిల్లీ కి పోయి కాంగ్రెస్ వాళ్ల మీద ఫిర్యాదు చేశాను. బీజేపీ తో దోస్తీ మాకు అవసరం లేదు. కానీ కాంగ్రెస్ వాళ్లు ఇక్కడ గల్లీల్లోనే బీజేపీ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి కి నేనంటే చాలా ప్రేమ ఉన్నట్లు ఉంది. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news