టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదల అయ్యారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు చింతమనేని ప్రభాకర్ ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యం లో దెందులూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నిన్న రాత్రంతా జైలులోనే ఉన్న ఆయన.. ఇవాళ విడుదల అయ్యారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ… న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు అన్యాయం చేస్తారా…రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని మండిపడ్డారు.
తన నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే 3 మండలాల ఎస్సై లు తన మీద కేసులు నమోదు చేశారని నిప్పులు చెరిగారు. పెదవేగి మండలo ఎస్సై కేసు ఎప్పుడు పెడతాడో ఎదురు చూస్తున్నానని… నర్సీపట్నం లో గంజాయి గురించి ప్రశ్నించి 151 నోటీసు ఇచ్చారని తెలిపారు. జగన్ మాత్రం తన కేసులపై డిశ్చార్జి పిటిషన్ వేస్తాడని.. తన పై మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.
జగన్ కే నా కుటుంబం ఉంది నాకు కుటుంబం లేదా?? నాకు పోలీసులుతో ప్రమాదం ఉంది తప్ప నక్సల్స్ తో ప్రమాదం లేదన్నారు.