ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫోర్టీఫైడ్ బియ్యాన్ని సరాఫరా చేయనున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో విశాఖలో పౌరసరాఫరాల శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడి కేంద్రాలతో పాటు కొన్ని జిల్లాలకు ఫోర్టీఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇకనుంచి అన్ని జిల్లాలకు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 6,165 కోట్ల విలువైన 30.19 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. అలాగే రైతులకు రూ.4,800 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈనెల 15లోగా మిగతా దాన్యం కొనాలని అధికారులకు సూచనలు చేశామని, పేర్కొన్నారు.