తెలంగాణకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రైల్వే లైన్ల విద్యుదీకరణలో భాగంగా పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుదీకరణ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ చేసిన ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు.
అలాగే, కాజీపేటకు వ్యాగన్ ఓవర్ హాలింగ్, రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చాం. తర్వాత అక్కడ వ్యాగన్ తయారీని జత చేస్తాం. విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై అధ్యయనం చేస్తామని చెప్పారు. అయితే దేశంలో ఇప్పటికే చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రస్తుతం వేగన్ లకున్న అత్యధిక డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ అధ్యయనంలో తేలినందున దానిపై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రకటన చేసింది.