ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటర్ తర్వాత చాలా కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ఏదో ఒక కోర్సును ఎంచుకుంటున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఇంజినీరింగ్ కోర్సులంటే యువతలో ఎంతో క్రేజ్ ఉంది. అయితే కొంతకాలంగా ఇంజినీరింగ్ విద్య నాసిరకంగా తయారవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ తగు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బీటెక్ లో ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలతో కూడిన నాలుగు కొత్త కోర్సులకు రూపకల్పన చేసింది.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఐటీ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కోర్సులు తీసుకురానుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించిన తర్వాత కాలేజీలు కొత్త కోర్సులకు అనుగుణంగా సీట్ల సంఖ్య పెంచుకోవచ్చని జేఎన్టీయూ హైదరాబాద్ వర్గాలు తెలిపాయి. ఈ మార్పుతో బీటెక్ లో కోర్సుల సంఖ్య 22కి చేరింది.