తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూలీల ట్రాలీ వహానాన్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగ భద్రాద్రి జిల్లాలోని చంద్రుగొండ మండలంలోని సుజాత్ నగర్ అనే ఎస్సీ కాలనీ నుంచి మొత్తం 18 మంది మహిళా కూలీలు ట్రాలీ వాహనం ద్వారా సత్తుపల్లి కి ఉపాధి కోసం వెళ్తున్నారు. కూలీల ట్రాలీ వాహనం తిప్పనపల్లి జాతీయ రహదారి వద్ద వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బోగ్గు టిప్పర్ ఢీ కొట్టింది.
దీంతో వాహనంలో ఉన్న సుజాత (35), స్వాతి (27) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే ఈ ప్రమాదంలో గాయ పడ్డ పలువురి ని ఆస్పత్రికి తరలించారు. అలాగే లక్ష్మిదేవీ (50), సాయమ్మ (54) కొత్త గూడెం ఎరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. మృతి చెందారు. అలాగే లక్ష్మి మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదంలో గాయ పడ్డ పలువురి ని ఆస్పత్రికి తరలించారు. అయితే కూలీల ట్రాలీ వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్.. ఎదురుగా ఉన్న ఒక గోడ ను ఢీ కొట్టింది. దీంతో టిప్పర్ లో ఉన్న సందీప్, ఈశ్వర్ లకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కాగ ప్రమాదానికి కారణం అని భావిస్తున్న టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.