ఉచిత కోచింగ్ : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. డీజీపీ ప్ర‌కట‌న

-

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అంద‌రూ కొద్ది రోజుల్లో బిజీ కానున్నారు. పెద్ద సంఖ్య‌లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుద‌ల అయింది. దీంతో నిరుద్యోగులు అంద‌రూ కోచింగ్ సెంట‌ర్ల వైపు చూస్తున్నారు. కాగ ఈ నేప‌థ్యంలో తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్ర‌యత్నంచే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అందు కోసం పోలీసుల‌కు ఆదేశాల‌ను సైతం జారీ చేశారు.

జిల్లాల ప‌రిధిలో, కమిషన‌రేట్ల ప‌రిధిలో ప్ర‌త్యేకంగా శిక్షణా శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్న‌ట్టు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. కాగ నిన్న సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన ఉద్యోగ ఖాళీల్లో కేవ‌లం హోం శాఖ లోనే 18,334 ఖాళీలు ఉన్నాయి.

వాటిని అతి త్వ‌ర‌లోనే భర్తీ చేయ‌నున్నారు. కాగ తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ నాటి నుంచి పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ స‌మయాల్లో రాష్ట్ర పోలీసుల‌కు నిరుద్యోగుల‌కు ప్ర‌త్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా ఆర్థికంగా వెన‌క‌బ‌డిన అభ్య‌ర్థుల‌కు వ‌స‌తి సౌకర్యం కూడా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news