మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గల్లీలో జరిగింది. కాగ మార్చి 9న తెలంగాణ రాష్ట్ర అంసెబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మహిళా దినోత్సవంతో ఉత్సవం జరిగింది. నేడు ఉద్యోగాల ప్రకటనతో ఉద్ధృతి నెలకొందని తెలంగాణ యువత అంటున్నారు. నిన్న మహిళా దినోత్సవం అయితే.. నేడు ఉద్యోగాల దినోత్సవం అంటూ నెటిజన్లు మీమ్స్, కార్టున్లు చేస్తున్నారు.
నిన్న మహిళాలకు మాత్రమే పండుగ.. నేడు యువత అందరికీ సీఎం కేసీఆర్ పండుగ చేశారని సెబ్బాస్ కేసీఆర్ అంటూ యువత నినాదాలు ఇస్తున్నారు. కాగ రాష్ట్రంలో సీఎం కేసీఆర్.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. ఎక్కుడో కొంత వెలితి ఉండేది. ముఖ్యంగా నిరుద్యోగులు కేసీఆర్ పై ఆగ్రహంగా ఉండే వాళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఉద్యోగాల భర్తీ లేదు అంటూ మండిపడే వారు.
కానీ సీఎం కేసీఆర్ ఒకే ఒక్క ప్రకటనతో తనపై వస్తున్న వ్యతిరేకతను కుకటివెళ్లతో పెకిలించేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన యువత నోటి నుంచే సెబ్బాస్ కేసీఆర్ అనేలా చేశారు. ఏది ఏమైనా.. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మహిళ దినోత్సవం తో ఒక ఉత్సవం జరిగింది. నేడు కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగాల దినోత్సవం గా ఒక ఉద్ధృతి నెలకొంది.