క్రెడిట్ కార్డు ని మీరు పొందాలని చూస్తున్నారా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచిత క్రెడిట్ కార్డు ఆఫర్ ని కూడా తీసుకు వచ్చింది. ఇక పూర్తి వివరాలని చూస్తే..
ఎలాంటి చార్జీలు కట్టకుండానే ఉచితంగా క్రెడిట్ కార్డు ని పొందొచ్చు. ఇక మనం ఈ ఆఫర్ వివరని చూస్తే.. ఎస్‌బీఐ ఉన్నతి క్రెడిట్ కార్డును అందిస్తోంది. దీన్ని ఫ్రీగానే పొందొచ్చు. ఇది కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. నాలుగేళ్ల వరకు ఎలాంటి చార్జీలు కట్టక్కర్లేదు. ఆ తరవాత నుండి చార్జీలు పడతాయి. మీకు కనుక ఇది కావాలంటే స్టేట్ బ్యాంక్ కి వెళ్లి దీన్ని పొందొచ్చు.
అక్కడే క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసేయచ్చు. క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ. 499. కానీ ఈ చార్జీలను మాఫీ చేసింది. ఉచితంగానే క్రెడిట్ కార్డును ఇస్తోంది. కనుక కస్టమర్లు ఫస్ట్ నాలుగేళ్లు జాయినింగ్ ఫీజు, వార్షిక చార్జీలు లేకుండా ఉచితంగానే ఈ కార్డును పొందొచ్చు. వాడచ్చు. ప్రతి రూ.100 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్ వస్తుంది. కార్డు పొందిన 15 రోజుల లోగా కార్డును ఉపయోగిస్తే అప్పుడు మీకు రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రూ. 25 వేలు లేదా అంతకన్నా ఎక్కువ ఎఫ్‌డీ కలిగి ఉంటేనే ఈ కార్డు లభిస్తుంది.