సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నరోగులకు కేసీఆర్ ప్రభుత్వం మందుల కిట్లను అందిస్తోంది. హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ రోగులకు నెల నెలా మందులు ఇస్తోంది. నాన్ కమ్యూనికెబుల్ వ్యాధుల కింద మందులను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్.
ఇప్పటికే 22 జిల్లాల్లో ఈ కిట్ల పంపిణీని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. 30 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్‌సీడీ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కోటీన్నర మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ప్రకటన చేశారు.