శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉచిత స్పర్శ దర్శనం ఈరోజు నుంచి పునఃప్రారంభం కానుంది. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.34 గంటల వరకు స్పర్శ దర్శనం అమలు చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు.
త్వరలోనే టోకెన్ విధానం అందుబాటులోకి వస్తుందని ఆలయ అధికారులు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో మాత్రం స్పర్శ దర్శనం ఉండదని స్పష్టం చేశారు. దీంతో భక్తులు సంతోషపడుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం శ్రీశైలం యాత్రకు వెళ్తున్నారు.