జగన్ రెడ్డి ‘డ్రాకో’ని మించిపోతున్నారని ఏపీలో డ్రకోనియన్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని యనమల రామకృష్ణుడు అన్నారు. అత్యంత క్రూరుడిగా పేరొందిన గ్రీస్ రాజు డ్రాకోను మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మించిపోతున్నారని, డ్రాకోనియన్ పేరుతో రూపొందించిన విశృంఖల అరాచక రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగాన్ని ఏపీలో అమలు చేస్తూ ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.
సిరాతో రాసే చట్టాలను రక్తంతో రాసి ప్రజలను హింసించిన నేర చరిత్ర డ్రాకోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అంతకు మించిన అరాచక పాలన సాగిస్తున్నారని రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రావాల్సిన సదుపాయాలు తన కేసుల కోసం తాకట్టు పెట్టారన ఆయన రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాతో ప్రజాస్వామ్య మనుగడకే పెను ముప్పులా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని డ్రాకో రాజ్యాంగంలోని అరాచకత్వం, రాజారెడ్డి అకృత్యాల పర్వాలను కలగలిపి నవ్యాంధ్రను నరకానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేస్తున్నారని అన్నారు.