దుస్తువులతో ఆ వ్యాధి సోకుతుందా..?

-

దాదాపుగా 10 నెలల నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతికేలా చేసినా కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. అయినా.. కరోనా ఎప్పుడు వ్యాప్తి చెందుతుందో.. ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో స్పష్టంగా చెప్పలేమంటున్నారు వైద్యులు.ఉద్యోగాలు, తమ తమ పనులు ముగించుకొని ఇళ్లకు వచ్చినప్పుడు దుస్తువులులు వేడినీళ్లలో ఉతకాలని, వెంటనే స్నానం చేయాలని అంటుంటారు.. కానీ.. మీరు వెళ్లిన చోటు, అక్కడున్న జనసముహంపై ఆధారపడి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. మాస్క్‌ ధరించాలని తప్పనిసరి చేసినా చాలామందికి ఇది పాటించడం లేదని దీంతో పెద్దప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పరీక్షలు చేస్తేనే..

ప్రసుత్తం అందరూ ఆరోగ్యంగా ఉన్నా పరీక్షలు చేస్తేనే అసలు విషయం బయటపడుతోంది.
కరోనా వైరస్‌ బరువుగా ఉండటంతో వెంటనే నేలపై పడిపోతుంది. దీంతో అంతగా మన దుస్తులకు అంటకపోవచ్చు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తులు గట్టిగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అప్పుడు వచ్చే పెద్దతుంపర్లు మాత్రం దుస్తులకు అంటుకుంటే ప్రమాదమే సుమి. దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకొని అదే చేతులను మన దుస్తువులను తాకితే కూడా అంటుకొవచ్చు. అందుకే కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించే వారకు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, అధ్యాయనాలు హెచ్చరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version