తిరుమలలో జనవరి 21 నుంచి లడ్డూ ఫ్రీ !

తిరుమల తిరుపతి అంటే చాలు మొదట గుర్తుకు వచ్చేది లడ్డూ. అక్కడ స్వామి దర్శనం ఎంతకష్టపడాలో స్వామి ప్రసాదం లడ్డూకూ అంతే కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీటీడీ కొన్ని రోజుల కిందట భక్తుల కష్టాలు తీర్చే తియ్యటి కబురు చెప్పింది. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడుకి లడ్డూల కొరత లేకుండా చూడటమే కాకుండా ఫ్రీగా లడ్డూ ఇస్తామని. ఇది సరిగ్గా రేపటి నుంచి అంటే జనవరి 21 నుంచి అమలులోకి రానున్నది.

తిరుమలలో రాయితీ లడ్డూ విధానానికి నేటితో స్వస్తి చెప్పనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. లడ్డూ ప్రసాదం పంపిణీలో ఈ రోజు అర్థరాత్రి నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తామని అయన తెలిపారు.

అంతేకదా ఒకటికి మించి ప్రతీ అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలని అయన పేర్కొన్నారు. రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని అయన తెలిపారు. భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. ఇక ఇప్పటి నుంచి భక్తులు స్వామి ప్రసాదం కోసం కష్టపడనక్కర్లేదు. అంతా స్వామి దయ!

కేశవ