స్తంభించిన భారత్.. రైతన్నలకు అండగా ప్రజలు..!

-

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 13 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళన కేంద్రం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినా ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. దీంతో రైతు సంఘ నాయకులు ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్ కు మద్దతుగా దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతో పాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి.

farmers
farmers

రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు దఫాలుగా చర్చలు జరిపింది. అయినా ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదు. 6వ విడత చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం రేపటికి వాయిదా వేసింది. ఒక వైపు చర్చలు సాగుతుంటే మరోవైపు బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారని కేంద్ర పశ్నిస్తున్నా.. రైతులు చర్చలకు ముందు భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టారు.

పార్టీల జెండాలు లేకుండానే బంద్ లో పాల్గొనాలని రైతులు నేతలను కోరడంతో అందరూ ఆకుపచ్చ జెండాలతో బంద్ లో పాల్గొన్నారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా శాంతియుతంగా నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అన్నా హజారే నిరాహార దీక్ష..
రైతులకు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో ఒక రోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన ఉధృతం చేయాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, ఈ చట్టాల వల్ల రైతులకు నష్టం కలుగుతుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలని పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్ర రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్ గా మారి తక్కువ ధరకే కొని రైతులకు మోసం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం అరవింద్ క్రేజీవాల్ గృహ నిర్బంధం..
ఢీల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ ను పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సింఘూ బోర్డర్ వద్ద ఆందోళన చేపడుతున్న రైతులను సోమవారం పరిమర్శించారన్నారు. ప్రస్తుతం బీజేపీ అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసి ఎవరిని కలవనీయకుండా చేస్తున్నారని ట్విటర్ లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news