భారతీయ చలన చిత్ర సంగీత చరిత్రలో ఇది ఒక బ్లాక డే అని చెప్పవచ్చు. డిస్కోరాజా బప్పి లహిరి ముంబైంలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంగీత దిగ్గజం మృతికి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బప్పి లహిరి అంత్యక్రియలు ఇవాళ జరగడం లేదట. తాజా సమాచారం ప్రకారం.. ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి.
దేశంలోనే డిస్కో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన బప్పి లహిరి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. లాస్ ఏజెంల్స్ నుంచి ఆయన కుమారుడు బప్పి లాహిరి వచ్చాక రేపు ముంబైలో ఆయన అంతిమ కార్యక్రమాలు జరుగనున్నాయి. 1952న నవంబర్ 27న పశ్చిమబెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి దాదాపు 500 కు పైగా సినిమాల్లో 5వేల పాటలకు సంగీతం అందించారు. ఆయన మృతి సంగీత ప్రియులను శ్లోకంలో ముంచేసింది.