కేసీఆర్ గారు ఇది ”క్వారంటైన్..క్వాటర్ టైమ్” కాదు…! ట్వీట్టర్ లో నెటిజన్లు ఇలా…..

-

ఇప్పుడు ట్వీట్టర్ లో కూడా సీఎం కేసీఆరే హాట్ టాపిక్…! తెలంగాణలో కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ప్రెస్ మీట్ లు నిర్వహించడం లేదని రాష్ట్రంలో టెస్టులే చేయడం లేదని ట్వీట్టర్ లో పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఓ ప్రభుత్వ ఉద్యోగి కి తన కుమార్తెకి ఇద్దరికీ కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీకి వెళ్లారు కానీ గాంధీ లో బెడ్లు లేవని వారిని తిరిగి పంపించేశారు. ఆపై ఆమె తుంబే ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఆమెకి రోజుకు 1.5 లక్షలు బిల్ వేస్తున్నారని తన దగ్గర డబ్బులు లేవని ఆమె రోదిస్తుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకొమ్మని ఆమె వేడుకుంటుంది. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్లు సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్టర్ వేధికను మీమ్ లతో నింపేస్తున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి టెస్టులు మాత్రం చాలా తక్కువ చేస్తున్నారు. ప్రతీరోజు అతి తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా కూడా తెలంగాణ రెండవ స్థానం లో ఉంది. లాక్ డౌన్ కూడా పెట్టె అవకాశం ఉంది అని వార్తలు వెల్లువెత్తాయి కానీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే చాలా కాలం అయ్యింది. ఆయన నోరు ఎందుకు తెరువడం లేదని అందరూ ట్వీట్టర్ వేధికగా ప్రశ్నిస్తున్నారు..దాంతో ఇప్పుడు ‘’వేర్ ఈజ్ కేసీఆర్’’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news