భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపద్యంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ను కలిశారు. ఇరువురు దాదాపుగా గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. ప్రధాని మోడీ భారత్ చైనా సరిహద్దుల్లో జరుగుతున్నా ఉద్రిక్త పరిస్థితుల గురించి రాష్ట్రపతికి వివరించారు. జాతీయస్థాయి కీలక అంశాలను కూడా మోడీ రాష్ట్రపతి దృష్ఠికి తీసుకువచ్చారు. ఇటు దేశ పరిస్తితుల గురించి మాట్లాడుతూనే ప్రధాని భారత్ కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సమస్యల గురించి కూడా రాష్ట్రపతికి వివరించారు వారి సూచనలు కూడా తీసుకున్నారు. కరోనా కట్టడి అంశం పై కూడా ఇద్దరు చర్చించారు. భేటీ అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ట్వీట్ చేశారు. చేశారు. జాతీయ, అంతర్జాతీయపరంగా ప్రాధాన్యత ఉన్న అంశాలపై చర్చించినట్టుగా ఆయన తెలిపారు.