ముచ్చర్లలో నిర్మించే నాలుగో సిటీనే ప్యూచర్ సిటీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడారు. సిరిసిల్ల కార్మికులతో బతుకమ్మ చీరలను నేయించలేదు. ఎయిర్ ఫోర్ట్ వరకు ఎంఎంటీఎస్ ఎందుకు విస్తరించలేదు. ఏ పాలసీ తీసుకురాలేదని మమ్ముల్నీ విస్మరిస్తున్నారు. బీఆర్ఎస్ ఏ పాలసీ తీసుకొచ్చింది అని ప్రశ్నించారు. ధరణీ మీద పాలసీలు తీసుకొస్తాం.. మీరు సలహాలు ఇవ్వండి.
బీఆర్ఎస్ తీసుకొచ్చిన బతుకమ్మ చీరలను ఆడబిడ్డలు తిరస్కరించారు. ట్యాంక్ బండ్ లో నీటిని కొబ్బరి నీల్లలా మారుస్తామని నేను చెప్పలేదు. స్పోర్ట్స్, గేమ్స్ లో యువతకు నైపుణ్యం కల్పిస్తాం. టూరిజం హబ్ క్రియేట్ చేస్తాం. ఎల్బీనగర్ లో సిరీస్ ఫ్యాక్టరీ కారణంగా ఆ ప్రాంతం పొల్యూట్ అయింది. బీఆర్ఎస్ పదేళ్లు ఏలి ప్రజలను మోసం ేసింది. వ్యవసాయం, స్పోర్ట్స్, ఫార్మసీ అభివృద్ది చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముచ్చర్ల వద్ద భూసేకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కేటీఆర్ రెచ్చగొడుతున్నారని తెలిపారు.