పోడు భూములకు రైతు బంధు ఇస్తారా.. లేదా..? : కేటీఆర్

-

పోడు భూములకు రైతు బంధు ఇస్తారా.. లేదా..? అని ఇవాళ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్బంగా కేటీఆర్ చర్చించారు.  అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ప చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని కోరారు.  తెలంగాణ చీకట్లతో నిండిపోతుందని పదేళ్ల కిందట కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరోవైపు పదేళ్లలో రాష్ట్ర సంపద భారీగా పెరిగిందని తెలిపారు.

గతంలో విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. మంచి పాలసీలు తీసుకొచ్చి బీఆర్ఎస్ వెల్ కమ్ చెబుతుంది. మీ ప్రభుత్వం గొప్పగా చేయాలని కోరుకుంటున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నాం. బస్సుల సంఖ్యను పెంచండి. మూసీ సుందరీకరణకు మేము కూడా ప్రయత్నించాం. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు మేము కూడా చెల్లించాం. ఆత్మహత్య చేసుకున్న రైతులను, కార్మికులను, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సూచించారు. రాష్ట్ర పురోగతి పై వాస్తవాలు చెప్పినందుకు మంత్రులను అభినందిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news