టీడీపీ చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారమా? – కడప వైసీపీ

-

టీడీపీ చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారమా? అంటూ ఫైర్‌ అయ్యారు కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు. ఇవాళ మీడియా సమావేశంలో కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్రంలో ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాం..కూటమి సుపర్ సిక్స్ పథకాలు వారిని గెలిపించాయని భావించవచ్చు అన్నారు. గతంలో 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు..2019 లో అందుకే చంద్రబాబు ను ప్రజలు ఓడించారని ఆగ్రహించారు.

kadapa YCP district president Suresh Babu

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో టీడీపీ నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయలేదా…వందల కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను కబ్జా లు చేశారన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక జిల్లాలో టిడిపి కార్యాలయాలను నిర్మించారు..కడపలో కూడా కోట్ల రూపాయల స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి అప్పజెప్పా లని చూశారని మండిపడ్డారు. పాత మునిసిపాలిటి కార్యాలయ స్థలాన్ని అక్రమిచాలని చూశారు..మేయర్ గా ఆరోజు అడ్డుకుని కోర్టుకు పోయి స్టే తెచ్చామన్నారు. టీడీపీ నేతలు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం అని మాట్లాడటం హేయమైన చర్య అని మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకునే వైసీపీ కార్యాలయ నిర్మాణాలు చేపట్టామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news