Gaami : అఘోర లుక్‌లో విశ్వక్‌సేన్‌……

-

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గామి.ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. అభినయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం సమయానికి పూర్తి కాలేదు. దీంతో గత ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన గామి చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.

ఇలాంటి సమయంలో గామి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది.గామి సినిమాను తొందరలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా యూవీ క్రియేషన్స్‌ ప్రకటించింది. ఈ మేరకు సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది. అఘోరాగా కనిపిస్తున్న విశ్వక్‌సేన్‌ను టచ్‌ చేసేందుకు చాలామంది చేతులు వేస్తున్నట్లుగా ఉంది. ఈ చిత్రం క్యాప్షన్‌ కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. అతని అతి పెద్ద భయం మానవ స్పర్శ.. అతని గాఢమైన కోరిక కూడా మానవ స్పర్శే అంటూ ఉన్న కొటేషన్‌ మూవీపై అంచనాలను పెంచుతుంది.ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నది.. ఇక ఈ మూవీ రన్‌ టైమ్‌ 2 గంటల 24 నిమిషాలు ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news