Telangana: జిల్లాల విభజనపై కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన జిల్లాల విభజనపై తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాం అసహనం వ్యక్తం చేశారు . కరీంనగర్ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లాల విభజన చేసిందని అన్నారు. జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం కన్నా ప్రజల నిర్ణయమే కీలకమని కోదండరాం తెలిపారు. ఓ జిల్లాలో రాజకీయాల లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అస్తవ్యస్తం చేసిందని కోదండరాం అన్నారు. జిల్లాలో ప్రజల మౌలిక సదుపాయలతో పాటు ప్రజల జీవన, ఆర్థిక, బౌగోళిక అంశాలపై చర్చించి కమిటీ వేయాలని అన్నారు. హుజురాబాద్‌ ఉద్యమకారులు ఉన్న గడ్డ అని, ఈ చర్చ ఇప్పట్లో ఆగేది కాదని, తెలంగాణలో నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందని తెలిపారు.

అధికారం లేకుంటే జీర్ణించుకోలేని స్థితి కొందరిలో నెలకొందని ఆయన విమర్శించారు. కాగా, ఇటీవలే కోదండరాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడైన సంగతి తెలిసిందే. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవి ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news