ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్. ఖమ్మంలో జరుగుతున్న కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. నిర్బంధపూరితంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని.. ఇలాంటి నిర్బంధాలే పతనానికి నాంది అన్నారు. ప్రజలు చైతన్యవంతులై ఇలాంటి నిర్బంధాలను ఛేదించాలని గద్దర్ పిలుపునిచ్చారు. ఉపా కేసులు వున్నప్పటికీ తాను పాడటం మానేయలేదన్నారు. తాను కోరుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని.. కానీ ఇప్పటికే పార్టీ పెట్టానని గద్ధర్ చెప్పారు. తెలంగాణలో యుద్ధం మొదలైందని ఆయన తెలిపారు.
కేసీఆర్ పాలన నిర్బంధపూరితంగా నడుస్తోందని విమర్శించారు. తెలంగాణ సమాజంపై నిర్బంధాలే పతనానికి నాంది అని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులై ఇలాంటి నిర్బంధాలను ఛేదించుకుని బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ సీఎం కేసీఆర్ విధానాలను విమర్శిస్తూ అప్పటికప్పుడు పాట పాడారు. ఉపా కేసులు ఉన్నప్పటికీ తాను పాడటం మానేయలేదని స్పష్టం చేశారు.