ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

-

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్వి సప్తాహాం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా జాతీయ జెండాల పంపిణీ మొదలైంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బంజారాహిల్స్​లోని ఎన్​బీటీ, మైథిలి నగర్​లో ఆమె జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. గ్రేటర్​లో బల్దియా తరఫున 20 లక్షల జెండాలను అందించనున్నట్లు చెప్పారు గద్వాల్ విజయలక్ష్మి. ఇప్పటికే 8 లక్షల జెండాలను పంపిణీ చేశామన్నారు. నెక్లెస్ ​రోడ్​లో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు గద్వాల్ విజయలక్ష్మి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ ఆధ్వర్యంలో ముషీరాబాద్, భోలక్​పూర్​లో జెండాలను పంచారు. కుత్బుల్లాపూర్​లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జెండాలను పంపిణీ చేశారు. మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీకారెడ్డి తార్నాకలోని తన ఇంటి వద్ద పలువురికి జెండాలను అందజేశారు.

Who is Gadwal Vijayalakshmi, Hyderabad Mayor Who Left US Citizenship To  Enter Politics

కంటోన్మెంట్ వార్డు నం.5 విక్రమ్​పురి కాలనీలో సీఈవో అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాలను పంచారు. మల్కాజిగిరి మున్సిపల్ ఆఫీసు వద్ద ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జెండాల పంపిణీ ప్రోగ్రామ్​ను ప్రారంభించారు. మల్కాజిగిరి, వినాయక్ నగర్ డివిజన్లలోని పలు కాలనీల్లో బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి బల్దియా అధికారులతో కలిసి జెండాలను పంచారు. బండ్లగూడ జాగీర్​లో కార్పొరేటర్ రాము ఆధ్వర్యంలో హిమాయత్​సాగర్ ఏరియాలో డ్వాక్రా మహిళలకు జెండాలను అందజేశారు. వికారాబాద్ కలెక్టరేట్​లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ సునీతా రెడ్డి, కలెక్టర్ నిఖిల ఆధ్వర్యంలో జెండాల పంపిణీ ప్రోగ్రామ్​ను ప్రారంభించారు.బీజేపీ షాద్​నగర్ సెగ్మెంట్ ఇన్​చార్జి నెల్లి శ్రీవర్ధన్​రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జెండాలు పంచారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news