టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గంభీర్ ఖరారు..?

-

టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ఖరారైనట్లు సమాచారం .ఈ నెల(జూన్) చివరి వారంలో బీసీసీఐ పెద్దలు.. గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. చిన్న తప్పును ఉపేక్షించని గంభీర్ చేతుల్లోకి అంటే టీమిండియా ఆటగాళ్లు సహా అభిమానులూ భయపడిపోతున్నారు. విఫలమైతే ఆటగాళ్లపై ఎలాంటి చర్యలుంటాయా తెలిపేలా సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ 2024తో ముగియనుంది. తదుపరి జట్టుతో కొనసాగేందుకు ద్రవిడ్ సుముఖంగా లేరు .

కొత్త కోచ్ కోసం రికీ పాంటింగ్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, మహేళ జయవర్దనే, జస్టిన్‌ లాంగర్‌ లాంటి పరువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్‌వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అందునా, ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ ను ఛాంపియన్‌గా నిలబెట్టిన నాటి నుంచి గంభీర్ పేరు బాగా వినిపిస్తోంది. అతను టీమిండియాను విజయపథంలో నడిపించగలరని మాజీలు చెప్పుకొచ్చారు. అయితే, హెడ్ కోచ్ పదవి కోసం అతను దరఖాస్తు చేసుకున్నారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news