కోహ్లీపై విమర్శలు చేసిన గంభీర్…!

-

న్యూజిలాండ్ పర్యటనలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై ఇప్పుడు అనేక విమర్శలు వస్తున్నాయి. టీం కి ప్రధాన బలంగా ఉన్న కోహ్లీ ఆట తీరు జట్టుకి ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా అతను మూడు నాలుగు స్థానాల్లో వచ్చి ఈ పర్యటనలో రెండు మూడు మ్యాచుల్లో మినహా కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేదు. టి20 సీరీస్ లో పర్వాలేధనిపించినా వన్డే సీరీస్, టెస్ట్ సీరీస్ లో దారుణంగా ఆడుతున్నాడు.

తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు పరుగులకే అవుట్ అయ్యాడు కోహ్లీ. అతని బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి దాదాపు 22 ఇన్నింగ్స్ లు అయిపోయింది. దీనితో కోహ్లీ పనైపోయింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా టీం ఇండియా మాజీ ఆటగాడు, బిజెపి ఎంపీ గౌతం గంభీర్ కోహ్లీ ఆట తీరుపై తీవ్ర విమర్శలు చేసాడు. ఆట తీరుపై తనదైన శైలిలో చురకులు అంటించాడు.

కోహ్లీ ని కివీస్ ఆటగాళ్ళు కవ్వించడం లేదని, కవ్విస్తే అతను సెంచరీ చేస్తాడని, కోహ్లిని రెచ్చగొడితేనే బాగా ఆడతాడు అంటూ కామెంట్స్ చేసాడు గంభీర్. ఇదిలా ఉంటే టీం ఇండియా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ఓపెనర్ పృథ్వీ షా, సీనియర్ ఆటగాడు పుజారా, హనుమ విహారి అర్ధ సెంచరీ లతో ఆదుకోవడం తో జట్టు ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది. ఈ మ్యాచ్ లో గెలవకపోతే సీరీస్ పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news