వినాయకుడు కి ఈ పండ్లు, పూలు చాలా ఇష్టం.. పూజించేటప్పుడు తప్పక పెట్టండి..!

-

వినాయకుడిని చాలామంది పూజిస్తూ ఉంటారు. వినాయకుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా చేయండి. వినాయకుడు అనుగ్రహం ఉంటే మనం అనుకున్న పనులు పూర్తి అవుతాయి. మొదట మనం ఏ దేవుడిని పూజించాలన్నా కూడా వినాయకుడిని పూజించాలి వినాయకుడిని పూజిస్తే ఆటంకాలే కూడా లేకుండా మన పనులు పూర్తయిపోతాయి. వినాయకుడిని పూజించేటప్పుడు కొన్ని పూలని కొన్ని పండ్లని కచ్చితంగా పెట్టాలి మరి ఏ పండ్లని ఏ పూలని వినాయకుడి పూజ కోసం ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

lord-ganesh

 

వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పూలని పండ్లను పెట్టాలి మందార పూలు వినాయకుడికి చాలా ఇష్టం. అలానే ఎర్రటి పూలను కూడా వినాయకుడి కోసం పెట్టాలి. వినాయకుడిని పూజించేటప్పుడు పారిజాతం పూలు కూడా పెట్టండి వినాయకుడికి ఈ పూలంటే కూడా ఇష్టం. గరిక అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. జిల్లేడు పూలతో వినాయకుడిని పూజిస్తే వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది.

కదంబ పుష్పాలతో కూడా పూజించండి. పెళ్లి అయ్యి ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు మల్లెపూలతో వినాయకుడిని ఆరాధించడం మంచిది. వినాయకుడికి దానిమ్మ పండ్లు మామిడి పండ్లు అంటే ఇష్టం అలానే అరటి జామ కూడా ఇష్టం. చెరుకుని కూడా వినాయకుడికి పెట్టండి ఆపిల్ దానిమ్మ ఆరంజ్ ద్రాక్ష నేరేడు పండ్లను కూడా వినాయకుడిని పూజించేటప్పుడు నైవేద్యంగా పెట్టండి. ఇలా కనక మీరు వినాయకుడిని పూజించారంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news