గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్.. డేట్ లాక్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతోమంది యువ నటీనటులకు స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు చాలామందికి తెలియని ఉత్సాహం. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో తన తర్వాత సినిమాని కూడా అంతే జోష్ తో తెరకెక్కిస్తున్నారు మెగాస్టార్. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు.

చిరంజీవి ఒకవైపు వింటేజ్ బ్లాక్ బస్టర్ మూవీని రీ రిలీజ్ చేసేందుకు చిత్ర వర్గాలు కూడా సిద్ధమవుతున్నాయి. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను రీ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.. విజయ్ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ మాస్ ఇమేజ్ ను మరింత పెంచేసిందని చెప్పవచ్చు. అంతేకాదు ఇందులో చిరంజీవి చెప్పే ప్రతి డైలాగు కూడా థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలను తెప్పించింది. అంతలా థియేటర్లలో మారుమ్రోగిన ఈ సినిమాను ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు అందుకు సంబంధించిన అధికారిక డేట్ కూడా విడుదల చేశారు.

ఫిబ్రవరి 11వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు మరొకసారి తీసుకురానున్నట్లు పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. 1991లో విడుదలైన ఈ సెన్సేషనల్ మూవీని ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేస్తున్నారని తెలిసి అభిమానుల సంతోషానికి అవధులు లేవు. మొత్తానికి అయితే చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీని రీ రిలీజ్ చేస్తూ ఆయన ఇమేజ్ మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news