హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్.. వివాహిత మృతి !

ఎన్ని చట్టాలు చేస్తున్నా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ లోని ఓ వివాహిత పై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొల్లూరు తాండాకు చెందిన యువకులు తెలిసిన మహిళని తీసుకువచ్చి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ రేప్ తరువాత స్పృహ కోల్పోయి పట్టించుకునేవారు ఎవరూ లేక వివాహిత ప్రాణాలు కోల్పోయింది.

ఇక ఈ మృతి చెందిన మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు చెబుతున్నారు. భర్త పన్నెండేళ్ల క్రితం మృతి చెందడంతో ఆమె పిల్లల్ని కష్టపడి సాకుతోంది. అయితే నిన్నరాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తాండాకు తీసుకువచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో మధు, నందు యాదవ్, కుటుంబరావులను అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.