కర్నూలులో లేచిపోయిన ఇద్దరు యువతులు…!

కర్నూలులో ఇద్దరు అమ్మాయిల లవ్ ఎఫైర్ సంచలనం రేపుతుంది. ఇద్దరు అమ్మాయిలు గాడంగా ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయారు. కర్నూలు టౌన్ నర్సింహారెడ్డి నగర్ కి చెందిన 20 ఏళ్ల యువతి సంతోష్ నగర్ కాలనీకి చెందిన 21 సంవత్సరాల యువతి చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరి స్నేహం ముదిరి ప్రేమగా మారింది.

సంతోష్ నగర్ కాలనీకి చెందిన యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఇద్దరు యువతులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటూ లెటర్ రాసిపెట్టి ఇంట్లో 50 వేలు తీసుకుని పరారయ్యారు. లెటర్లు చూసి కంగారు పడ్డ ఇరు కుటుంబాల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. యువతుల ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇద్దరు యువతులు ప్రేమించుకుని, పారిపోవడం పై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.