మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మొదటి నిందితుడు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం కోర్టు పేర్కొంది.
“ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. వివేకా హత్యకేసును సుప్రీంకోర్టే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. గంగిరెడ్డికి బెయిల్ రద్దుచేసే విషయాన్ని కూడా తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుంది.” అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈయన బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.