పీకే డైరక్షన్: గంటా కొత్త పార్టీ?

-

ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే..ఎక్కడ చూసిన పీకే లేకుండా రాజకీయం నడవటం లేదు..అందరికీ ఈయనే వ్యూహకర్తగా కావాల్సి వస్తుంది..ఇక ఈ పీకే పాలిటిక్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో వచ్చేసింది..2019 ఎన్నికల ముందు ఏపీలో జగన్ కోసం పీకే పనిచేసిన విషయం తెలిసిందే..ఇక పీకే వ్యూహాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే..ఎలాంటి రాజకీయం చేస్తారో కూడా తెలిసిందే. కులాల మధ్య కుంపటి రాజేస్తారు..ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా చేస్తారు..అలాగే ప్రత్యర్ధులని దెబ్బకొట్టడానికి వారిపై ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారో చెప్పాల్సిన పని లేదు.

అలా చేసే గత ఎన్నికల్లో చంద్రబాబుని దెబ్బకొట్టి, జగన్‌ని గెలిచేలా చేశారు..ఇక ఇప్పుడు కూడా పీకే..జగన్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. విచిత్రంగా పోలిటికల్ వ్యూహాలు పన్నడంలో ధిట్ట అయిన కేసీఆర్ సైతం..పీకేని వ్యూహకర్తగా పెట్టుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో పీకే వ్యూహాలు మొదలైపోయాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో పీకే హవా నడుస్తోంది.

ఇదే సమయంలో ఇటీవల ఏపీ రాజకీయాల్లో కాపులు టార్గెట్‌గా రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే..కాపులకు రాజ్యాధికారం కావాలని చెప్పి..కొందరు కాపు నేతలు సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు..తాజాగా విశాఖలో సమావేశమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

అయితే కాపుల కోసం గంటా ఆధ్వర్యంలో కొత్త పార్టీ వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది..ఇదంతా పీకే డైరక్షన్‌లో, మెగాస్టార్ ఆశీస్సులతో, తాడేపల్లి ప్రొడక్షన్‌లో జరుగుతుందని చెప్పి కొందరు తెలుగు తమ్ముళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కొత్త పార్టీ కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అదే సమయంలో గంటా…టీడీపీ-జనసేనలని కలపడానికి ప్రయత్నిస్తున్నారంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో గంటా రాజకీయం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news