త్వరలో గ్యాస్ సిలెండర్ ధర పెంపు..!

-

గ్యాస్ సిలెండర్ ధరలు మరొక సారి పెరిగేటట కనపడుతోంది. రానున్న రోజుల్లో సిలిండర్ ధర భారీగా పెరగచ్చని అంటున్నారు. ఇదే కనుక జరిగితే సామాన్యులకి మరెంత కష్టం అవుతుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత సిలిండర్ ధర భారీగా పెరగొచ్చని అంటున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే.. ముడి చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్ల పైకి చేరింది.

gas
gas

కానీ ఇంకా గ్యాస్ సిలెండర్ ధర లో ఏ మార్పు లేదు. 2021 అక్టోబర్ 6 నుంచి ధర స్థిరంగానే వుంది. ధరలలో ఎలాంటి మార్పు కూడా రాలేదు. ఇది ఇలా ఉంటే మార్చి 10 తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ.100కు పైగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే సామాన్యులపై ఎఫెక్ట్ పడుతుంది. 2021 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి 1 వరకు చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.170 పైకి చేరింది.

అక్టోబర్ 1న ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1736 వద్ద ఉండేది. ఇక నవంబర్‌ కి వచ్చే సరికి రేటు రూ.2 వేలకు చేరింది. అదే డిసెంబర్‌లో అయితే రూ.2101కు వెళ్ళింది. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధర తగ్గింది. ఇప్పుడు ఈ సిలిండర్ ధర రూ.1907 వద్ద వుంది.

అదే పది కేజీల సిలెండర్ అయితే రూ. 634కే పొందొచ్చు. ఇది ఇలా ఉంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలు సవరిస్తూ ఉంటాయి. దీనితో సిలెండర్ ధరలు పెరగొచ్చు, తగ్గచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలకు అనుగుణంగా రేట్లు అనేవి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news