సెప్టెంబర్ లో మారిన గ్యాస్ సిలెండర్ ధరలు..!

ప్రతి నెలా మనం చూసుకున్నట్లయితే వంట గ్యాస్ ధర (LPG) లో మార్పు కనబడుతోంది. ఆగస్టు నెలలో గ్యాస్ సిలిండర్ 25 రూపాయలు పెరిగింది. అదే విధంగా జూలైలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇలా మనం గత రెండు నెలల నుండి చూసుకున్నట్లయితే… వరుసగా సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి.

Gas.jpg
Gas.jpg

మనం ఈ సంవత్సరం జనవరి నుండి చూసుకున్నట్లయితే… గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికి 165 రూపాయలు పెరిగింది.  గ్యాస్ సిలిండర్ ధర ఈ నెలా కూడా పెరిగింది. ఇక వివరాలని చూస్తే.. ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు మళ్లీ రూ.25 పెరిగింది. ధరల పెంపు ఈరోజు నుంచే అమలులోకి వస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండో సారి కావడం గమనార్హం. ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు రూ.884కు చేరింది.

మన తెలుగు రాష్ట్రాలలో ధరలు చూస్తే.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే.. రూ.975 వరకు చెల్లించుకోవాలి. సిలిండర్ బుకింగ్ ధర రూ.945. డెలివరీ బాయ్ తీసుకునే రూ.30 జత చేస్తే.. రూ.975 అవుతుంది. అంటే మొత్తం రూ.1000 పడుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ నెలలో గూగుల్ ఫేక్ కంటెంట్ కలిగిన యాప్స్ ని తొలగించనుంది. అంతేకాకుండా గూగుల్ డ్రైవ్ కొత్త అప్డేట్ ని కూడా ఇవ్వనుంది. అలాగే ఈ నెల నుండి ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ వచ్చాయి. ఈరోజు నుండి ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ మారబోతున్నాయి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్, ధరల పెరుగుదల వల్ల లాజిస్టిక్ వ్యయాలు కూడా పెరిగాయి. దీంతో అమెజాన్ నుండి గుడ్స్ ఆర్డర్ ఇవ్వాలి అంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. 500 గ్రాములు ప్యాకేజీ కోసం యాభై ఎనిమిది రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. రీజినల్ కాస్ట్ రూ.36 గా ఉండే అవకాశం ఉంది.