హైదరాబాద్: గ్యాస్ వినియోగదారులపై మళ్లీ బారం పడనుంది. ఇది ఒకరకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశీయంగా వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 25.50 పెంచారు. హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 16 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ. 861.50గా వంట గ్యాస్ సిలిండర్ ధర ఉంది. పెరిగిన ధరతో కలిపి ఇక నుంచి రూ.877.5గా ఉండనుంది.
హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండపై రూ.84 పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1684కాగా పెరిగిన ధరతో కలిసి రూ. 1768గా ఉండనుంది. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ రూ. 834.50గా ఉంది. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.
దీంతో వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ఇప్పటికే కరోనా కారణంగా నిత్యావసరాలన్నీ పెరిగాయి. ఇప్పుడు గ్యాస్ ధరలు పెరగడంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆకాశాన్నింటిన నిత్యావసరాలను కూడా తగ్గించాలని కోరుతున్నారు.