బ్రేకింగ్ : విశాఖలో మరో ఫ్యాక్టరీ నుండి విషవాయువు లీక్

-

విశాఖ పారిశ్రామిక ప్రాంత ఎరువుల కర్మాగారం కోరమండల్ సంస్థ నుండి విషవాయువు వెలువడినట్టు తెలుస్తోంది. దీంతో సంస్థకు అనుకుని ఉన్న పిలకవాని పాలెం, కంచుమాంబ కాలనీ ప్రాంతాల్లో నలుగురికి అస్వస్థత చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగి, సంస్థ యాజమాన్యంపై మండిపడుతున్నారు. అయితే విశాఖపట్నంలో ఎరువుల కర్మాగారం ‘కోరమాండల్’ నుండి వాయువు వెలువడిందన్న వార్తలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు.

కర్మాగారం పరిసర గ్రామాల్లో స్థానికుల ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో వస్తున్న కథనాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, గాజువాక పరిసర ప్రాంత అధికార యంత్రాంగంతో వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి, ఎవరికీ ప్రమాదం లేదని తెలిసినా, స్థానిక ప్రజలకు భరోసా కలిగే విధంగా అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి మేకపాటి ఆదేశాలు జారీ చేశారు. వాయువు వెలువడిన కర్మాగారం ఏదనే దానిపై స్పష్టత లేకపోవడంతో మరింత జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి మేకపాటి, వాయువు వెలువడిన కర్మాగారం, దాని ప్రభావం, కారణాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news