గ్యాస్ కంపెనీలు సిలిండర్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. తాజాగా సిలిండర్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. గృహ అవసరాల సిలిండర్ ధర 50 రూపాయల మేర పెరిగింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 769 రూపాయలకు చేరింది. పెరిగిన సిలిండర్ ధరలు నిన్న అర్థ రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అటు పెట్రోల్, ఇటు గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి, నెలవారీగా సవరిస్తూ ఉంటాయి. అయితే, అంతర్జాతీయ ఇంధన రేట్లు, యూఎస్ డాలర్-రూపాయి మారకపు రేట్ల ఆధారంగా.. ఈ ధరలు పెరగ వచ్చు లేదా తగ్గ వచ్చు. దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల అమ్మకాలపై భారత ప్రభుత్వం ప్రస్తుతం వినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత సబ్సిడీ మొత్తం నేరుగా.. వినియోగదారు బ్యాంకు ఖాతాలో జమవుతోంది.