హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ !

Join Our Community
follow manalokam on social media

ఒకపక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతుంటే మరో పక్క వరుస రోడ్డు ప్రమాదాలు సంచలనం రేపుతున్నాయి. మొన్న అరకు, నిన్న కర్నూలులో రోడ్డు ప్రమాదం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోగా ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. హైదారాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.

ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతూ రోడ్డు పై ఉన్న గుంతను తప్పించబోయి ఇద్దరు యువకులు కింద పడ్డారు. అయితే అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ  కింద పడ్డ ఇద్దరు యువకులపైకి దూసుకు వెళ్లి వారి మీదకు ఎక్కడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఇద్దరు యువకులు చదర్ ఘాట్ ముసా నగర్ ప్రాంతానికి చెందిన యువకులని చెబుతున్నారు. ఇందులో ఫసీ ఖాన్(19) సంవత్సరాలు కాగా మోసిన్ (23) సంవత్సరాలు అని చెబుతున్నారు. 

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...