కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడడంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో డైరెక్టుగా రిలీజ్ అయ్యయి. ఓటీటీలో మేజర్ ఫీల్డ్ ఆక్రమించిన అమెజాన్ ప్రైమ్, తెలుగు సినిమాలని రిలీజ్ చేసింది. అందులో ప్రేక్షకులని బాగా ఆకర్షించిన చిత్రాలలో “గతం” కూడా ఒకటి. ఎన్నారైలందరూ కలిసి పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరించిన గతం సినిమా విమర్శకులని మెప్పించడంతో పాటు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.
ఐతే తాజాగా ఈ సినిమా మరో అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శనకి ఎంపికైంది. ఇండియన్ పనోరమా అవార్డుని సొంతం చేసుకుంది. కరోనా కారణంగా ఆన్ లైన్లో జరగనున్నఈ ఫెస్టివల్, జనవరి 16నుండి 21వరకు జరగనుంది. కిరణ్ కొండమడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భార్గవ పొలదాసు, రాకేష్, పూజిత కూరపర్తి నటించారు.