భారీ వర్షాలు, యుమునా నది మహోగ్రరూపంతో ఢిల్లీ నగరం అతలాకుతలం అవుతోంది. ఎన్నడూ లేనంతగా యమునా నది ఉప్పొంది ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఏ క్షణాల ఏ ప్రమాదం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు. గత 40 ఏళ్లకు పైగా రికార్డు స్థాయిలో వరదలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలను హెచ్చరించారు. విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. వర్షాలు తగ్గుముఖం పట్టి ఎగువన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలక కారణంగా యమునా నదీ ఉప్పొంగుతోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్…. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మాజీ క్రికెటర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ నగరం మురికి కాలువలా మారిందని, ప్రజలు తమకు ఏదీ ఉచితంగా రాదని గుర్తించాలని, అభివృద్ధిని పక్కన పెట్టి అన్నీ ఉచితమని వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు.