తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం… !

-

తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి నిర్దిష్టమైన రుజువులు ఏమీ లేవు. కాగా తెలంగాణాలో మాత్రం ఈ సంవత్సరాంతంలో ఎన్నికలు జరగవచ్చన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యనే రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త అధికారులను మరియు పోలింగ్ కు అవసరమైన స్టాఫ్ ను సమాయత్తం చేసుకుంటోంది. కాగా తాజాగా తెలుస్తున్న అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా రిటర్నింగ్ అధికారులు మరియు సహాయ రేతర్కింగ్ అధికారులు పోస్ట్ లను ఖరారు చేసింది. ఇక ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలకు కావాల్సిన ఆర్వో మరియు ఏ ఆర్వో ల కోసం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాగా ఇప్పుడు తెలంగాణాలో కేసీఆర్ నేతృత్వంలోని BRS అధికారంలో ఉంది.

అతి త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ను చేయాలని కేసీఆర్ చాలా కట్టుదిట్టంగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఇక బీజేపీ మరియు కాంగ్రెస్ లు మునుపటి కన్నా బలంగా మారుతూ BRS కు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news