మిథున రాశి 12 రాశుల్లో ఒకటి కానీ.. ఈ రాశి వారికి ఉండే ప్రత్యేకతలు మాత్రం ఎవరికి ఉండవనే చెప్పాలి. మిథున రాశి వారు అందిరితోనూ జోవియల్ గా ఉంటారు. ఎవరిపైనా ఇట్టే బుట్టలో వేయగలరు ఇలా ఒకటి రెండా.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి ముందు మీరు ఎలాంటి నాటకాలు వేయలేరు. కాబట్టి.. ఈ రాశివారు కొన్ని విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది. ఈ రాశివారికి ఎలాంటి విషయాలు చెప్పకుండా ఉంటే మంచిదో ఇప్పుడు చూద్దాం..
ఈరాశి వారు అందిరితోనూ కలుపుగోలుగా ఉంటారు. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడూతూనే ఉంటారు. వీరికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. ఎదుటివారిపై జోక్ లు వేస్తూ జోవియల్ గా ఉంటారు. అయితే ఈ జోక్స్ ను సీరియస్ గా తీసుకుని వారిని ఏదైనా అన్నాం అంటే.. ఇక మనతో మాట్లాడరు. ఏ విషయాన్ని మీతో పంచుకోరు. వీరితో రిలేషన్ ఉండాలంటే కనీసం జోక్స్ బ్యాడ్ గా ఉందని కూడా చెప్పకూడదు.
ఈ రాశివారు చాలా తెలివిగలవారు. అందిరితో సరదాగా ఉండటానికి ఇష్టపడుతారు. తమ చుట్టూ ఉండే వారు కూడా సరదాగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా సీరియస్ గా ఉంటే అస్సలు ఒప్పుకోరు. అయితే వీరు అలా చేయడం మీకు ఇష్టం లేదని చెప్పారనుకోండి…ఇక మీ ముఖం కూడా చూడరు.
మిథున రాశి వారు త్వరత్వరగా నిర్ణయాలను మార్చుకుంటారు. నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారా..? ఈ ప్రశ్న మిథున రాశివారిని అస్సలు అడగకూడదు. వీరికి ఆ ప్రశ్న అస్సలు నచ్చదట. ఎందుకంటే ఈ రాశివారు.. తమ పట్ల తాము చాలా గర్వంగా ఫీలౌతుంటారు. అన్నింట్లో తాము తోపు అని ఫీలౌతూ ఉంటారు. కాబట్టి.. అలాంటవారిని ఈ ప్రశ్నలు అడిగితే.. ఈ రాశివారికి అస్సలు నచ్చదు.