రెమ్యున‌రేష‌న్ విష‌యంలో జెండ‌ర్ తేడా.. న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

-

సినిమా ఇంస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ అనేవి చాలా ఎంత పెద్ద దుమారం రేపుతున్నాయో ప్ర‌త్యుకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే చాలామంది ధైర్యంగా త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై గొంతెత్తుతూ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నారు. ఇక తాజాగా రెమ్యున‌రేష‌న్ Remuneration విష‌యంలో హీరోయిన్లు గొంతెత్తారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోన‌మ్ క‌పూర్ రెమ్యున‌రేష‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

రెమ్యున‌రేష‌న్ /Remuneration
రెమ్యున‌రేష‌న్ /Remuneration

హీరోల రెమ్యునరేషన్ అనేది హీరోయిన్స్ రెమ్య‌న‌రేష‌న్ కంటే చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని, ఇదంతా ఇండ‌స్ట్రీలో జెండర్ తేడా వ‌ల్ల వ‌స్తోంద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేసింది. ఇండ‌స్ట్రీలో చాలామంది ఇప్పుడు ఇదే జెండ‌ర్ తేడాను చూపిస్తున్నార‌ని వివ‌రించింది. రీసెంట్ గా ఆమె ఓ ఇంగ్లీష్ పేప‌ర్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇవ‌న్నీ తెలిపింది.

హీరోయిన్లు రెమ్యున‌రేష‌న్లు పెంచితే అవ‌కాశాలు రావ‌ని, ఆఫ‌ర్లు ఎవ‌రూ ఇవ్వ‌ర‌ని తెలిపింది. ఇక ఈమె కంటే ముందు మొన్న తాప్సీ కూడా హీరోలు రెమ్యునరేషన్ పెంచితే అది వారి ఎదుగుద‌ల అంటార‌ని, కానీ హీరోయిన్లు కొంచెం పెంచినా దాన్ని స‌మ‌స్య‌గా చూస్తార‌ని తెలిపింది. త‌మ‌తో పాటే కెరీర్ స్టార్ట్ చేసిన హీరోలు ఇప్పుడు వారికంటే నాలిగింత‌లు తీసుకుంటే తాము మాత్రం ఇంకా త‌క్కువే తీసుకుంటున్నామ‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news