జల వివాదం : ఏపీ రైతులకు షాక్‌ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

-

కృష్ణా జలాల వివాదం పై తెలంగాణ హైకోర్టులో కృష్ణా జిల్లా రైతులు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 28 తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 34 విడుదల చేసింది. అయితే… ఈ జీవో ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు కృష్ణా జిల్లా రైతులు. జీవో 34 విడుదల చేసి విద్యుత్యుత్తకి నీటిని అక్రమంగా తరలిస్తుంది అని పిటీషన్‌ లో పేర్కొన్నారు రైతులు. వెంటనే జీవోను కొట్టేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని లంచ్ మోషన్ పిటీషన్ వేసారు కృష్ణా జిల్లా రైతులు.

అయితే..ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు… కీలక వ్యాఖ్యలు చేసింది. అంతర్రాష్ట్రల జల వివాదం పై సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని విచారించే అధికారం తమ పరిధిలో లేదని హై కోర్టు వ్యాఖ్యనించింది.

ట్రిబ్యునల్ కు పూర్తి అధికారులు ఉన్నాయని కదా అని వ్యాఖ్యానించిన హై కోర్టు… సెక్షన్ 11 అంతర్రాష్ట్రల జల వివాదం ప్రకారం ఈ పిటిషన్ అర్హత పై పిటిషనర్ లను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు 2008 లో జల వివాదాల పై ఇచ్చిన తీర్పును చదువుకుని రేపు రావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news