టాలీవుడ్ మేకర్స్ ఎక్కువగా హీరోయిన్ అనే మాట వినిపించడం ఆలస్యం ముంబాయి వైపు చూస్తుంటారు. ఇక పాన్ ఇండియా అంటే కంపల్సరీగా హిందీ బ్యూటీస్‌నే దింపుతుంటారు. అయితే బాలీవుడ్ మేకర్స్ మాత్రం తెలుగు హీరోయిన్స్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇక్కడి హీరోయిన్స్‌ని ముంబాయి తీసుకెళ్తున్నారు.
రాజమౌళి నుంచి మొదలుపెడితే, పూరీ జగన్నాథ్ వరకు పాన్ ఇండియన్ మూవీస్ అనగానే అందరూ హిందీ హీరోయిన్స్‌నే తీసుకుంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’కి రాజమౌళి ఆలియా భట్‌ని తీసుకొస్తే, ‘లైగర్’కి అనన్యాపాండేని ఒప్పించాడు పూరీ. ఇక నాగ్ అశ్విన్ అయితే ప్రభాస్ సినిమాకి దీపిక పదుకొణేని హీరోయిన్‌గా తీసుకున్నాడు.
తెలుగు మేకర్స్ అంతా హిందీ హీరోయిన్స్ వైపు చూస్తోంటే, బాలీవుడ్ మేకర్స్ మాత్రం మన హీరోయిన్స్‌ని ముంబాయి తీసుకెళ్తున్నారు. ‘కంచె’ తర్వాత సరైన హిట్‌లేని ప్రగ్యా జైశ్వాల్‌ని బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నాడు సల్మాన్ ఖాన్. ‘ఆంటిమ్ ది ఫైనల్’ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడీగా నటించబోతోంది ప్రగ్యా జైశ్వాల్. చబ్బీ లుక్స్‌తో తెలుగు యూత్‌ని అట్రాక్ట్ చేస్తోన్న రాశీ ఖన్నా కూడా హిందీ ఇండస్ట్రీకి వెళ్లింది. ‘మద్రాస్ కేఫ్’తో కెరీర్ స్టార్ట్ చేసిన రాశి ఖన్నా, ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో వెబ్ సీరీస్ చేస్తోంది. షాహిద్ కపూర్‌తో కలిసి ఒక వెబ్ సీరీస్ చేస్తోంది రాశీ ఖన్నా.
సౌత్ సినిమాలు బాలీవుడ్‌కి వెళ్తున్నట్లే, హిందీ సినిమాలు కూడా సౌత్‌కి వస్తున్నాయి. ఇక్కడి మార్కెట్‌లో వసూళ్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే సౌత్ హీరోయిన్స్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇక బాలీవుడ్‌లో హీరోయిన్ అంటే రేంజ్ పెరుగుతుందని తెలుగు హీరోయిన్స్ కూడా ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్నారు.సౌత్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో టాప్ చైర్‌ని టార్గెట్ చేసిన రష్మిక మందన్నకి బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది రష్మిక. అలాగే అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఒక సినిమా చెయ్యబోతోంది రష్మిక.
‘అర్జున్ రెడ్డి’తో యూత్‌కి కనెక్ట్ అయిన హీరోయిన్ షాలినీ పాండే. ఈ సినిమా తర్వాత షాలినీకి తెలుగులో పెద్దగా హిట్స్‌లేవు. కానీ హిందీలో మాత్రం వరుస సినిమాలు వస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’తో బాలీవుడ్‌కి వెళ్లిన షాలినీ పాండేకి యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో మూడు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. పెళ్లికి ముందు వరకు హిందీ ఇండస్ట్రీ గురించి ఆలోచించలేదు సమంత. అయితే మిసెస్ నాగచైతన్యగా మారిపోయాక హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘ఫ్యామిలీమెన్2’ వెబ్ సీరీస్‌లో నటించింది సమంత. ఈ సీరీస్‌లో సమంత నెగటివ్ రోల్ ప్లే చేసింది.