జీవో నంబర్ 317.. సీఎం చేతికి కేబినెట్ సబ్‌కమిటీ రిపోర్టు

-

గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్ 317 అమలులో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అటు ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిష్కరణకు మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ.. తుది నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సీల్డ్ కవర్‌లో ఆదివారం అందజేసింది. అంతకుముందు ఉద్యోగులు, టీచర్లతో పాటు ఉద్యోగ సంఘాల నేతలతో పలు దఫాలుగా ఈ సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించింది. ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారి నుంచి ఫిజికల్‌గా,ఆన్‌లైన్ ద్వారా గ్రీవెన్స్ అప్లికేషన్లను స్వీకరించింది.

వివిధ శాఖల అధికారులు,మేధావులతోనూ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి వారి బదిలీల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి నివేదికను రూపొందించింది. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన క్రమంలో జిల్లా,జోనల్,మల్టీ జోనల్ స్థాయిలో బదిలీలు చేసేందుకు వీలుగా ఈ జీవోను తీసుకురాగా.. స్పౌజ్ ఉద్యోగుల బదిలీల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలోనే వాటికి పరిష్కారం చూపేందుకు భట్టి అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తుది రిపోర్టును సీఎంకు అందజేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version