తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జర్మనీకి చెందిన Liteauto GmbH అనే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండర్, మంత్రి కేటీఆర్ సమక్షంలో Liteauto GmbH కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈకంపెనీ రూ. 1500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీంతో ఈ కంపెనీ ద్వారా.. ఏకంగా 18 వేల మందికి ఉపాధి కలుగనుంది.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి వేల ఎకరాలలో ప్రభుత్వం వద్ద ఉన్నదన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఇలా అనుమతి ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ అని.. తెలంగాణ లో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. 17 వేల 500 కంపెనీలకు టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు క్లియరెన్స్ ఇచ్చామమని… జర్మనీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం నాకు నచ్చిందని వివరించారు. జర్మనీలో చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం అక్కడి విధానాలు బాగున్నాయని.. జర్మనీ ప్రభుత్వం, అక్కడి పారిశ్రామిక వేత్తలతో
కలసి పనిచేయడానికి సిద్ధమన్నారు.