స్టేట్ బ్యాంక్ స్కీమ్.. 10 ఏళ్ల పాటు నెలకు రూ.11 వేలు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ఉపయోగకరంగా ఉంటోంది. బ్యాంకింగ్ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి చాలా పథకాల్ని తెచ్చింది. వీటి వలన వివిధ రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇక పూర్తి వివరాలు చూస్తే..

ఒకసారి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీరు ప్రతి నెలా కొంత సొమ్మును పొందాలని అనుకుంటే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అదిరే పథకం ఉంది. గరిష్ఠంగా 10 ఏళ్ల పాటు నెల నెలా చేతికి రూ. 11 వేలు అందుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకం ఇది. ప్రతి నెలా కొంత ఆదాయం ని ఈ స్కీమ్ తో పొందవచ్చు.

3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ టెన్యూర్‌ తో నెల నెలా చేతికి డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్లు 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలు గా వున్నాయి. ఎదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. నెలకు కనీసం రూ.1000 నుంచి మొదలుకొని గరిష్ఠంగా ఎంతైనా ఈ స్కీమ్ లో పెట్టచ్చు. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా రాబడి వస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెడితే ఎక్కువ అమౌంట్ వస్తుంది. అలానే యాన్యుటీ పథకంలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా.

Read more RELATED
Recommended to you

Latest news